బీజేపీకి దాసోజు శ్రవణ్ రాజీనామా.. టీఆర్ఎస్ గూటికి చేరనున్న వైనం

  • ఇటీవలే కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన శ్రవణ్
  • సాయంత్రం టీఆర్ఎస్ లో చేరనున్న వైనం
  • బలహీన వర్గాలకు బీజేపీలో స్థానం లేదని విమర్శ
బీజేపీలో చేరి మూడు నెలలు కూడా కాకుండానే ఆ పార్టీకి దాసోజు శ్రవణ్ షాక్ ఇచ్చారు. బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపించారు. గత సెప్టెంబర్ లో ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఈ సాయంత్రం ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారు. 

బీజేపీకి రాజీనామా చేసిన సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ ఆ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన లాంటి బలహీన వర్గాలకు చెందిన నేతలకు బీజేపీలో స్థానం ఉండదనే విషయం అర్థమయిందని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందని దుయ్యబట్టారు. డబ్బు, మద్యం అండతో గెలవాలని బీజేపీ భావిస్తోందని విమర్శించారు. దశ, దిశ లేకుండా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు.


More Telugu News