'మైఖేల్' కోసం 24 కేజీల బరువు తగ్గాను: సందీప్ కిషన్
- సందీప్ కిషన్ హీరోగా రూపొందిన 'మైఖేల్'
- కథానాయికగా దివ్యాన్ష కౌశిక్
- కీలకమైన పాత్రలో విజయ్ సేతుపతి
- ఈ సినిమా తనకి ఒక పరీక్ష అంటూ సందీప్ వ్యాఖ్య
సందీప్ కిషన్ కి ఈ మధ్య కొంత గ్యాప్ వచ్చినట్టుగా అనిపిస్తోంది. 'గల్లీ రౌడీ' తరువాత ఆయన నుంచి మరో సినిమా లేదు. ఈ నేపథ్యంలో ఆయన 'మైఖేల్' సినిమా చేశాడు. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకి, రంజిత్ జయకోడి దర్శకత్వం వహించాడు. దివ్యాన్ష కౌశిక్ కథానాయికగా నటించిన ఈ సినిమా, కొంచెం ఆలస్యంగానే విడుదలకి ముస్తాబవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.
ఈ టీజర్ లాంచ్ ఈవెంటులో సందీప్ కిషన్ మాట్లాడుతూ .. లైఫ్ లో మనకి ఏది కరెక్టు .. ఏది రాంగ్ అని చాలామంది చెబుతుంటారు. కానీ మన కెపాసిటి ఎంత అనే విషయంలో మనకి ఒక క్లారిటీ ఉండాలి. మనల్ని మనం ఏ స్థాయిలో చూసుకోవచ్చు .. ఎక్కడి వరకూ వెళ్లొచ్చు అనే విషయంలో ఒక అంచనా ఉండాలి. అలా నాకు నేను పెట్టుకున్న టెస్టునే 'మైఖేల్'
ఈ సినిమా కోసం ఎంత కష్టమైనా పడాలని డిసైడ్ అయ్యాను. పాత్రకి తగినట్టుగా కనిపించడం కోసం 24 కేజీలు బరువు తగ్గాను. ఒక రిస్కీ షాట్ ను ఎలా చేయాలో నాకు చూపించడం కోసం నేను లొకేషన్ కి వెళ్లేలోగా రెండుసార్లు చేసేసి రికార్డు చేసిన దర్శకుడు రంజిత్ జయకోడి. అలాంటి దర్శకుడు దొరకడం నా అదృష్టం. ఈ సినిమా రిలీజ్ అయ్యేలోగా ఆయన మూడు సినిమాలకు సైన్ చేయడం నాకు సంతోషాన్ని కలిగించే విషయం. విజయ్ సేతుపతి వంటి ఆర్టిస్టుతో కలిసి నటించడం నాకు లభించిన వరంగా భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.