'కాంతార' ఘనవిజయం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం

  • రిషబ్ శెట్టి నటుడిగా, దర్శకుడిగా విశ్వరూపం
  • కాంతార బ్లాక్ బస్టర్ హిట్
  • ఊహించని రీతిలో పాన్ ఇండియా క్రేజ్
  • వృద్ధ దైవ నర్తకులకు అలవెన్స్ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కన్నడ చిత్రం కాంతార. ఇప్పుడీ సినిమా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటోంది. నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి ఫుల్ మార్కులు సొంతం చేసుకున్నారు. 

ఈ చిత్రంలో, ఆత్మలను సంతృప్తి పరిచేలా సాగే 'భూత కోల' అనే ప్రాచీన నృత్యాన్ని కూడా చూపించారు. ఇందులో నర్తించేవారిని దైవ నర్తకులు అంటారు. కాంతార చిత్రం చివర్లో రిషబ్ శెట్టి దైవ నర్తకుడిగా విశ్వరూపం ప్రదర్శించారు. ఓవరాల్ గా ఈ సినిమా అనేక వర్గాలను అలరిస్తూ బ్లాక్ బస్టర్ హిట్టయింది. 

ఈ నేపథ్యంలో, కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వయసు పైబడిన దైవ నర్తకులకు నెలవారీ భత్యం అందిస్తామని అధికారికంగా ప్రకటించింది. 60 ఏళ్లకు పైబడిన దైవ నర్తకులకు నెలకు రూ.2,000 చొప్పున అందిస్తామని వెల్లడించింది. ఈ విషయాలను బీజేపీ ఎంపీ పీసీ మోహన్ వెల్లడించారు.


More Telugu News