బంగారం అక్రమ రవాణాపై కస్టమ్స్ అధికారుల ఉక్కుపాదం... ఒక్కరోజులో రూ.11 కోట్ల విలువైన పుత్తడి పట్టివేత
- బంగారం అక్రమ రవాణాపై దృష్టి సారించిన కస్టమ్స్ అధికారులు
- 20 బృందాలుగా విడిపోయిన 100 మంది అధికారులు
- రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు
- బస్సులు, రైళ్లలో నిశితంగా సోదాలు.. నలుగురి అరెస్ట్
ఏపీలో బంగారం అక్రమ రవాణాపై కస్టమ్స్ అధికారులు దృష్టిసారించారు. నేడు ఒక్కరోజే రూ.11 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.
కస్టమ్స్ అధికారులు విజయవాడ, ఏలూరు, సూళ్లూరుపేట, కాకినాడ, చిలకలూరిపేట, నెల్లూరు ప్రాంతాల్లో బస్సులు, రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. 100 మంది అధికారులు 20 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. బస్సులు, రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న బంగారం, నగదును గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం 13.189 కిలోల పసిడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అదే సమయంలో రూ.4.24 కోట్ల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి సూళ్లూరుపేట వస్తున్న ఓ వ్యక్తి నుంచి అత్యధికంగా 5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.