హిందీలోను దూకుడు చూపుతున్న 'కాంతార'

  • కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'కాంతార'
  • తెలుగులోనూ భారీ వసూళ్లు 
  • హిందీలోనూ అదే స్థాయి రెస్పాన్స్ 
  • రిషబ్ శెట్టి నటన పట్ల ప్రశంసల వర్షం
రిషబ్ శెట్టి తన చిన్నతనంలో తన గ్రామంలోని ఒక ఆచారం .. ఆ ఆచారంతో ముడిపడిన కొన్ని సంఘటనలతో ఒక కథను రెడీ చేసుకున్నాడు. ఆ కథనే 'కాంతార' సినిమాగా తెరపైకి తీసుకుని వచ్చాడు. రచయితగా .. దర్శకుడిగా .. హీరోగా ఈ మూడు పాత్రలకి ఆయన న్యాయం చేశాడు. అందుకు వివిధ భాషల్లో ఈ సినిమా రాబడుతున్న వసూళ్లే నిదర్శనం. హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సినిమాను, తెలుగులో ఈ నెల 15వ తేదీన గీతా ఆర్ట్స్ వారు విడుదల చేశారు.

నిజానికి ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు తెలుగువారికి పెద్దగా తెలియదు. సినిమాలో ప్రధానమైన అంశంగా కనిపించే ఆచారం గురించి ఇక్కడి వారికి తెలియదు. అయినా కంటెంట్ ను ఆసక్తికరంగా నడిపించడంలో రిషబ్ శెట్టి సక్సెస్ అయ్యాడు. అందువలన ఇది మన భాష కాదు .. తెరపై మనవాళ్లెవరూ లేరు అనే ఫీలింగ్ కలగదు. ఈ కారణంగానే ఈ సినిమా 5 రోజుల్లోనే 22.3 కోట్లను వసూలు చేసింది. 

ఇక తెలుగుతో పాటే ఈ సినిమా హిందీలోను విడుదలైంది. అక్కడ కూడా ఈ సినిమా భారీ వసూళ్లనే రాబడుతోంది. ఇంతవరకూ అక్కడ ఈ సినిమా 13.10 కోట్లను వసూలు చేసింది. ఇంకా అదే జోరును కొనసాగిస్తూ వెళుతోంది. క్లైమాక్స్ లో అమ్మవారు ఆవహించి దుష్ట శిక్షణ చేయించే సన్నివేశంలో రిషబ్ శెట్టి నటనకు ప్రేక్షకులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. 



More Telugu News