దేశ రాజకీయాలపై కూడా చంద్రబాబు దృష్టి సారించాలి: సీపీఐ రామకృష్ణ

  • జగన్ కు రాజ్యాంగంపై అవగాహన లేదన్న రామకృష్ణ
  • మోదీ, అమిత్ షా అండలేకుండా ఒక్క రోజు కూడా సీఎం సీట్లో కూర్చోలేరని వ్యాఖ్య 
  • టీడీపీ, జనసేనలతో కలిసి పని చేసేందుకు సిద్ధమన్న రామకృష్ణ
ముఖ్యమంత్రి జగన్ కు ప్రజాస్వామ్యం పట్టదని, రాజ్యాంగంపై ఏమాత్రం అవగాహన లేదని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మద్దతు లేకపోతే జగన్ ఒక్క రోజు కూడా సీఎం కూర్చీలో కూర్చోలేరని చెప్పారు. ఎన్ని కేసులు ఉన్నా, అవినీతి నిరూపితమైనా జగన్ పై చర్యలు ఉండవని అన్నారు. 

జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీలో పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసిరావాలని కోరారు. టీడీపీ, జనసేనలతో కలసి పని చేసేందుకు తాము సిద్ధమని చెప్పారు. చంద్రబాబు రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాలపై కూడా దృష్టిని సారించాలని అన్నారు. 

విశాఖను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దోచుకుంటున్నారని రామకృష్ణ విమర్శించారు. ఢిల్లీలో విజయసాయిరెడ్డికి ఉన్నంత పవర్ మరెవరికీ లేదని చెప్పారు. బీజేపీ కుట్రలు పవన్ కల్యాణ్ కు అర్థమయ్యాయని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇతర పార్టీలతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధమని చెప్పారు.


More Telugu News