కరోనా కొత్త రకాలకు చిత్రమైన పేర్ల వెనుక ఎలాన్ మస్క్ ఉన్నాడా..?
- డోజికాయిన్ వ్యవస్థాపకుడు షిబెటోషి నకమోటో ప్రశ్న
- మస్క్ కుమారుడికి చిత్రమైన పేరు
- కరోనా పేర్లు కూడా ఇదే మాదిరి ఉండడంతో చిత్రమైన అనుమానం
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఓ ఊహించని ప్రశ్న ఎదుర్కొన్నారు. క్రిప్టో కరెన్సీ డోజ్ కాయిన్ సృష్టికర్త షిబెటోషి నకమోటో ట్విట్టర్ లో మస్క్ ను ఉద్దేశించి ఓ ఆసక్తికరమైన ప్రశ్న సంధించారు. ఇటీవలి కరోనా కొత్త వేరియంట్స్ కు పేర్లను ఎలాన్ మస్క్ పెట్టాడా? అన్నది నకమోటో సంధించిన ప్రశ్న. దీనికి కారణం లేకపోలేదు. ఎలాన్ మస్క్ తన కుమారుడికి “X Æ A-12 Musk” అనే పేరు పెట్టారు. ఇలాంటి పేరు పెట్టాలన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా చెప్పండి..?
ఎక్స్ బీబీ, బీక్యూ.1.1, బీఏ.2.75.2 ఇవి కరోనా కొత్త వేరియంట్ల పేర్లు. ఈ పేర్లతో కూడిన ఓ ఆర్టికల్ స్క్రీన్ షాట్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసి, ఈ పేర్లను ఎలాన్ మస్కే పెట్టాడా? అంటూ నకమోటో ట్వీట్ చేశారు. దీనికి మస్క్ కూడా సరదాగా స్పందించారు. ‘‘తప్పకుండా పిల్లవాడికి పేరు పెట్టే ఐడియాలు ఇస్తాను’’ అని రిప్లయ్ ఇచ్చారు. మస్క్ తన కిడ్ పేరు “X Æ A-12 Musk” లోని అర్థాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఈ పేరు తన జీవిత భాగస్వామి గ్రిమ్స్ సూచించినట్టు చెప్పారు. ఎక్స్ యాష్ ఏ ట్వెల్వ్ పేరుతో దీన్ని పిలుస్తారని వివరించారు.