మునుగోడు ఉప ఎన్నికలో గుర్తు మార్చడంపై రిటర్నింగ్ అధికారిపై సీఈసీ ఆగ్రహం

  • మునుగోడు ఉప ఎన్నికలో గుర్తుల వివాదం
  • రోడ్ రోలర్ గుర్తును మార్చడంపై సీఈసీ ఆగ్రహం
  • సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశం
మునుగోడు ఉప ఎన్నికలో గుర్తులకు సంబంధించి మరో వివాదం చోటుచేసుకుంది. తమ గుర్తు కారును పోలిన విధంగా మరి కొన్ని గుర్తులు ఉన్నాయని... వాటిని తొలగించాలని కోరుతూ టీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంలో తుది నిర్ణయం ఎన్నికల సంఘానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. 

తాజాగా రోడ్ రోలర్ గుర్తు విషయంలో వివాదం నెలకొంది. యుగ తులసీ పార్టీ అభ్యర్థి శివకుమార్ కు రోడ్ రోలర్ గుర్తును కేటాయించారు. అయితే, తాజాగా ఈ గుర్తును మార్చి వేశారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రోడ్ రోలర్ గుర్తును ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది. ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News