ఈమాత్రం దానికే జగన్, వైసీపీ నేతల ప్యాంట్లు తడిసిపోతున్నాయి: బొండా ఉమా

  • ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసమే చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారన్న బొండా ఉమా 
  • జగన్ దోపిడీని, అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామని వ్యాఖ్య
  • వచ్చే ఎన్నికల్లో పేర్ని నానికి డిపాజిట్ కూడా రాదన్న బొండా
జగన్ సైకో పాలనలో రాష్ట్రంలో స్టేట్ టెర్రరిజం కొనసాగుతోందని టీడీపీ నేత బొండా ఉమా విమర్శించారు. ప్రభుత్వ అరాచకాలను, చేతకానితనాన్ని ప్రశ్నించిన 40 మంది టీడీపీ కార్యకర్తలను వైసీపీ పొట్టన పెట్టుకుందని మండిపడ్డారు. 3 వేలకు పైగా టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని అన్నారు. 

ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారని చెప్పారు. దీనికే తాడేపల్లి ప్యాలెస్ వణుకుతోందని, జగన్, వైసీపీ నేతల ప్యాంట్లు తడిసిపోతున్నాయని అన్నారు. అందుకే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా నోటికి పని చెప్పారని దుయ్యబట్టారు. జగన్ పెంపుడు కుక్కలైన కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ కల్యాణ్ కాలి గోటికి కూడా సరిపోరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీలు ఇచ్చే కింగ్ జగనే అనే విషయాన్ని వైసీపీ కుక్కలు గుర్తించాలని చెప్పారు 

తాము అధికారంలో ఉన్నప్పుడు ఇదే మాదిరి చేసుంటే... జగన్ కానీ, వైసీపీ నేతలు కానీ రోడ్లపై తిరిగేవారు కాదని బొండా ఉమా అన్నారు. పోలీసు వ్యవస్థని అడ్డుపెట్టుకుని ఎన్నాళ్లు గూండాగిరి చేస్తారని ప్రశ్నించారు. తాము ఎప్పుడూ జగన్ రెడ్డి అవినీతిని, దోపిడీని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. విశాఖపట్నం కేంద్రంగా విజయసాయిరెడ్డి సాగించిన భూదోపిడీ గురించి, ఉత్తరాంధ్రలో మంత్రులు ధర్మాన, బొత్స, సీదిరి అప్పలరాజు, స్పీకర్ తమ్మినేనిలు సాగిస్తున్న భూకబ్జాలు, అరాచకాల గురించి ప్రశ్నిస్తామని అన్నారు. నడమంత్రపు అధికారంతో ఎగిసిపడుతున్న వైసీపీ నేతలందరికీ త్వరలోనే రాష్ట్ర ప్రజలు చెప్పులతో కొట్టి, సత్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 

అవినీతి పునాదులపై పార్టీని నిర్మించి, అధికారంలోకి వచ్చి, రాష్ట్రాన్ని దోచుకుంటున్న జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డిలది ఏ కలయిక? వారిది కాలుష్య కలయికా... లేక కాటికి పోయే కలయికా? అని ప్రశ్నించారు. గంటకొడుతూ, అర గంటవస్తే చాలని అమ్మాయిలని పిలిచే అంబటి రాంబాబు స్థాయి ఎంత... అతని బతుకెంత? అని అడిగారు. పేర్ని నానిని కేబినెట్ నుంచి జగన్ ఫుట్ బాల్ తన్నినట్టు తన్నినా సిగ్గు రాలేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో పేర్ని నానికి డిపాజిట్ కూడా రాదని అన్నారు.


More Telugu News