ఢిల్లీలో బాణసంచా కొన్నా, కాల్చినా రూ.200 జరిమానా... 6 నెలల జైలు శిక్ష కూడా

  • బాణసంచాపై నిషేధం విధించిన ఢిల్లీ సర్కారు
  • విక్రయాలు, వినియోగంపై నిషేధం
  • జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరిక
దీపావళి పర్వదినాన... బాణసంచా సంబరాలు లేకుండానే ఢిల్లీ వాసులు పండుగను జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే... బాణసంచాను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నిషేధ ఉత్తర్వుల ప్రకారం ఢిల్లీ పరిధిలో బాణసంచా కొనుగోలు చేసినా, కాల్చినా కూడా రూ.200 జరిమానా విధిస్తారు. అంతేకాకుండా 6 నెలల పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశాలున్నాయి.


More Telugu News