బన్నీ హార్డు వర్కును శివకార్తికేయన్ లో చూశాను: తమన్
- శివకార్తికేయన్ హీరోగా రూపొందిన 'ప్రిన్స్'
- హీరోయిన్ గా ఉక్రెయిన్ బ్యూటీ పరిచయం
- దర్శకుడిగా అనుదీప్
- తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 21న రిలీజ్
'జాతిరత్నాలు' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న అనుదీప్, తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా 'ప్రిన్స్' సినిమాను రూపొందించాడు. సునీల్ నారంగ్ .. సురేశ్ బాబు .. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాతో, ఉక్రెయిన్ భామ 'మరియా' హీరోయిన్ గా పరిచయమవుతోంది. సత్యరాజ్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వస్తోంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ - జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వచ్చిన ఈ వేదికపై తమన్ మాట్లాడుతూ .. "అనుదీప్ ఈ సినిమాకి దర్శకుడు అనగానే నేను ఒక అరగంట సేపు నవ్వుకున్నాను. ఎందుకంటే ఆయన రైటింగ్ స్టైల్ .. డైరెక్షన్ ఎలా ఉంటాయనేది నాకు తెలుసు. మరియా ఉక్రెయిన్ బ్యూటీ. తెలుగు .. తమిళ భాషల పట్ల అవగాహన పెంచుకుని చేయడం చూసి నేను ఆశ్చర్యపోయాను.
శివ కార్తికేయన్ విషయానికి వస్తే మొదటి నుంచి కూడా కష్టపడుతూనే ఈ రోజున ఈ స్థాయికి వచ్చాడు. లోకల్ స్టేజ్ ల పై మిమిక్రీ చేస్తూ .. టీవీలో యాకరింగ్ చేస్తూ ఈ రోజున ఇంతవరకూ వచ్చాడు. తన కష్టంతోనే తాను 100 కోట్ల మార్కెట్ వరకు వెళ్లాడు. తనకి అప్పగించిన పనిపై హండ్రెడ్ పర్సెంట్ హార్డు వర్క్ చేస్తాడు. అల్లు అర్జున్ తరువాత ఆ స్థాయిలో కష్టపడటం శివకార్తికేయన్ లోనే చూశాను" అంటూ చెప్పుకొచ్చాడు.