ఇట్స్ అన్ స్టాపబుల్... చంద్రబాబు, పవన్ భేటీపై టీడీపీ నేత జీవీ రెడ్డి కామెంట్
- పవన్ కల్యాణ్ తో భేటీ అయిన చంద్రబాబు
- భేటీపై హర్షం వ్యక్తం చేస్తున్న టీడీపీ, జనసేన శ్రేణులు
- ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగమేనంటూ టీడీపీ నేత జీవీ రెడ్డి వ్యాఖ్య
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. అధికార వైసీపీ ఈ భేటీపై విమర్శలు గుప్పిస్తుండగా... టీడీపీ, జనసేన శ్రేణులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ప్రకటన వెలువడకపోయినా... 2024 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల భేటీపై టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజాస్వామ్య వాదులంతా కలిసి రావాలి. ఈ రోజు జనసేన మరియు తెలుగుదేశం కలయిక అందులో ఓ భాగం. ఇట్స్ అన్ స్టాపబుల్ అంటూ ఆయన కామెంట్ చేశారు.