రామోజీరావును కలిసిన రేవంత్ రెడ్డి...రాహుల్ యాత్రకు మద్దతు ఇవ్వాలని వినతి
- ఈ నెల 23న తెలంగాణలోకి ప్రవేశించనున్న రాహుల్ గాంధీ పాదయాత్ర
- రామోజీని కలిసేందుకు ఫిల్మ్ సిటీ వెళ్లిన రేవంత్ రెడ్డి
- యాత్రకు మద్దతు ఇవ్వాలంటూ రామోజీకి వినతి
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్లను వెంటబెట్టుకుని ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావును కలిశారు. సోమవారం రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లిన రేవంత్ తదితరులు... అక్కడ రామోజీరావుతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందిగా రామోజీరావును రేవంత్ కోరారు. రామోజీని కలిసిన వారిలో రేవంత్ తో పాటు మల్లు భట్టి విక్రమార్క, మధు యాష్కీ గౌడ్ లు ఉన్నారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా సాగనున్న రాహుల్ పాదయాత్ర ఈ నెల 23న తెలంగాణలో ప్రవేశించనుంది. ప్రస్తుతం ఏపీలోని కర్నూలు జిల్లాలో సాగుతున్న యాత్ర జోగులాంబ జిల్లాలో తెలంగాణలోకి ప్రవేశించనుంది. తెలంగాణలో సుదీర్ఘంగా సాగనున్న ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైన టీపీసీసీ నేతలు పలు రంగాలకు చెందిన ప్రముఖులను కలిసి యాత్రకు మద్దతు కోరుతున్నారు. ఇందులో భాగంగానే వారు రామోజీరావుతో భేటీ అయ్యారు.