భూమికి సమీపంలో శక్తిమంతమైన గామా కిరణాల విస్ఫోటనాన్ని గుర్తించిన నాసా
- అక్టోబరు 9న భూమికి చేరువలో ప్రయాణించిన కాంతిపుంజం
- అత్యంత శక్తిమంతమైన రేడియో ధార్మికత సహితం
- గుర్తించిన నాసా ఫెర్మి గామా రే టెలిస్కోప్
- భూమిని చేరేందుకు 1.9 బిలియన్ కాంతి సంవత్సరాల ప్రయాణం
ఇటీవల భూమికి సమీపంలో అసాధారణ రీతిలో కనిపించిన ఓ కాంతిపుంజాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. అక్టోబరు 9న ఈ కాంతిపుంజం భూమికి చేరువ నుంచి ప్రయాణించినట్టు నాసా పేర్కొంది.
అత్యంత శక్తిమంతమైన రేడియో ధార్మికతతో కూడిన ఈ కాంతి వాస్తవానికి గామా కిరణాల విస్ఫోటనం అని నాసా వెల్లడించింది. విద్యుదయస్కాంత క్షేత్రాల అత్యంత భారీ విస్ఫోటనాల్లో ఇదొకటని తన ఫెర్మి గామా రే టెలిస్కోప్ సాయంతో గుర్తించింది. ఈ గామా కిరణాల విస్ఫోటనాన్ని గుర్తించడంలో నాసాకు నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ, విండ్ స్పేస్ క్రాఫ్ట్ సహకారం అందించాయి.
ఈ అమిత శక్తిమంతమైన పేలుడుకు నాసా జీఆర్బీ221009ఏ అని నామకరణం చేసింది. ఈ గామా కిరణాలకు సంబంధించిన సంకేతాలు సగిట్టా నక్షత్ర మండలం వైపు నుంచి వచ్చాయని, ఇవి భూమిని చేరుకోవడానికి 1.9 బిలియన్ కాంతి సంవత్సరాల పాటు ప్రయాణించాయని నాసా వెల్లడించింది.
విశ్వంలో సరికొత్త కృష్ణ బిలం ఆవిర్భావానికి సంబంధించి దీన్ని పురిటి కేకగా భావించాల్సి ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తన బరువుకు తానే ధ్వంసమైన ఓ భారీ నక్షత్రం నడిభాగం నుంచి ఇది ఉత్పన్నమై ఉంటుందని వారు అంచనా వేశారు. దీని ప్రభావంతో కణాలు కాంతివేగంతో ప్రయాణించేంత శక్తిని పొందుతాయని వివరించారు.
అంతేకాదు, ఇంతటి దేదీప్యమానమైన గామా కిరణాల విస్ఫోటనం వంటిది కొన్ని దశబ్దాల పాటు మరొకటి కనిపించకపోవచ్చని నాసా పేర్కొంది.