బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

  • బీజేపీతో పొత్తులో ఎక్కడో సరిగా లేదనే భావన కనపడుతోందన్న పవన్
  • ప్రజలను కాపాడుకోవడానికి వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తుందని వ్యాఖ్య
  • బీజేపీని గౌరవిస్తాం.. ఊడిగం చేయలేం అన్న పవన్
బీజేపీతో పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో అలయెన్స్ ఉన్నప్పటికీ.. ఎక్కడో సరిగా లేదనే భావన కనపడుతోందని... ఆ విషయం తమకు తెలుసు, బీజేపీ నాయకత్వానికి కూడా తెలుసని ఆయన అన్నారు. రోడ్ మ్యాప్ అడిగింది బీజేపీతో కలిసి వెళ్లడానికేనని.. అయితే వారు మ్యాప్ ఇవ్వక పోవడం వల్ల తనకు సమయం గడిచిపోతుందని చెప్పారు. 

తనకు పదవుల మీద వ్యామోహం లేదని... అయితే రౌడీలు రాజ్యాలు ఏలుతుంటే, గూండాలు గదమాయిస్తుంటే... ప్రజలను కాపాడుకోవడానికి తన వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తుందని అన్నారు. ప్రధాని మోదీకి కానీ, బీజేపీకి కానీ తాను వ్యతిరేకం కాదని చెప్పారు. బీజేపీని ఎప్పుడూ గౌరవిస్తామని... అలాగని ఊడిగం చేయలేమని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.


More Telugu News