ఆ విషయం పూరికి తెలియకుండా మేనేజ్ చేశాను: సత్యదేవ్
- విలక్షణ నటుడిగా సత్యదేవ్ కి పేరు
- చిన్న పాత్రల నుంచి హీరో పాత్రల దిశగా ప్రయాణం
- 'గాడ్ ఫాదర్' సినిమాతో పడిన బ్రేక్
- చిరూతో నటించాలనేది తన కల అని చెప్పిన సత్యదేవ్
సత్యదేవ్ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయింది. అయితే ఆయనలోని నటుడికి తగిన పాత్రలు పడలేదనే టాక్ ఉంది. చాలా చిన్న చిన్న పాత్రల నుంచి హీరోగా ఎదిగిన సత్యదేవ్, కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి 'గాడ్ ఫాదర్' సినిమా పడింది. ఈ సినిమాలో ఆయన పోషించిన జయదేవ్ పాత్రకి మంచి పేరు వచ్చింది. ఇంతవరకూ సత్యదేవ్ చేసిన పాత్రలు వేరు .. ఈ పాత్ర వేరు అనే మాట అంతటా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో సుమన్ టీవీ వేదికగా ఆయన అనేక విషయాలను పంచుకున్నాడు. "చిరంజీవిగారితో సినిమా చేయాలనేది నా కల. చాలా ఏళ్లుగా నేను ఆ కలను భద్రపరచుకుంటూ వచ్చాను. నేను సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వచ్చానని చాలామంది అంటూ ఉంటారు. కానీ సినిమాల్లోకి రావడం కోసమే నేను ఉద్యోగం చేశాను. ఎందుకంటే సినిమాల్లో అవకాశాలు వచ్చి నిలదొక్కుకునేంత వరకూ మనీ కావాలి. ఆ డబ్బు కోసమే నేను జాబ్ చేస్తూ వచ్చాను. 'బ్లఫ్ మాస్టర్' వరకూ నేను ఒక వైపున జాబ్ చేస్తూనే మరో సినిమాలు చేస్తూ వచ్చాను" అని అన్నాడు.
ఉదయం నుంచి షూటింగు .. నైట్ షిఫ్టులో జాబ్ అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాను. 'జ్యోతి లక్ష్మి' సినిమాకి ఏకధాటిగా నేను 39 రోజులు పనిచేశాను. షూటింగు చేస్తున్నట్టు ఆఫీసులో తెలియదు .. జాబ్ చేసుకుంటున్నట్టు పూరిగారికి తెలియదు. జాబ్ తాలూకు టెన్షన్ షూటింగులో .. సినిమా తాలూకు టెన్షన్ ఆఫీసులో కనిపించకుండా చూసుకునేవాడిని. 'ఘాజీ' .. 'మనవూరి రామాయణం' .. 'బ్లఫ్ మాస్టర్' ఇలానే పూర్తి చేస్తూ వచ్చాను. ఇక ఈ మధ్యనే జాబ్ మానేసి పూర్తి దృష్టి సినిమాలపై పెట్టాను" అంటూ చెప్పుకొచ్చాడు.