25న పాక్షిక సూర్య గ్రహణం.. మళ్లీ 2032లోనే చూడగలం!

25న పాక్షిక సూర్య గ్రహణం.. మళ్లీ 2032లోనే చూడగలం!
  • ఉదయం 8.58 గంటలకు ప్రారంభం
  • మధ్యాహ్నం 1.02 గంటలకు ముగింపు
  • సూర్యుడు, భూమి మధ్యలోకి రానున్న చంద్రుడు
ఈ నెల 25న పాక్షిక సూర్య గ్రహణం చోటు చేసుకోనుంది. ఇలాంటి పాక్షిక సూర్యగ్రహణాన్ని మళ్లీ 2032లో కానీ చూడలేము. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్ష్యలోకి రానున్నాయి. దీంతో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ నెల 25న ఉదయం 8.58 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం మొదలవుతుంది. మధ్యాహ్నం 1.02 గంటలకు ముగుస్తుంది. కంటికి రక్షణనిచ్చే సాధనాలతో దీనిని చూడొచ్చు.

న్యూమూన్ (చంద్రుడి ముఖం) సూర్యుడుకి అభిముఖంగా వెళ్లినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అప్పుడు సూర్యుడి కిరణాలు భూమిని చేరుకోకుండా చంద్రుడు అడ్డుపడతాడు. భూమికి, సూర్యుడికి మధ్య కక్ష్యలోకి చంద్రుడు ప్రవేశించినప్పుడు ఇలా జరుగుతుంది. దీంతో చంద్రుడి నీడ భూమిపై పడుతుంది. దీన్ని సూర్యగ్రహణంగా చెబుతారు. 

సూర్యుడు, చంద్రుడు, భూమి సరిగ్గా ఒకే కక్ష్యలో లేనప్పుడు.. సూర్యుడి ఉపరితంలో కొంత భాగం చీకటిగా మారినప్పుడు పాక్షిక సూర్య గ్రహణంగా చెబుతారు. పాక్షిక సూర్య గ్రహణంలో ఆరంభం, గరిష్ఠం, ముగింపు అని మూడు భాగాలు ఉంటాయి. ఆరంభంలో చంద్రుడు సూర్యుడి డిస్క్ లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత సూర్యుడిలో అధిక భాగాన్ని కప్పేస్తాడు. ఆ తర్వాత క్రమంగా పక్కకు జరుగుతాడు. 

మళ్లీ పాక్షిక సూర్యగ్రహం 2025 మార్చి 29న చోటు చేసుకోనుంది. కాకపోతే దీన్ని మనం వీక్షించలేం. తిరిగి 2032 నవంబర్ 3న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం మన దేశంలో కనిపిస్తుంది. 



More Telugu News