బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎన్నిక

  • ఏకగ్రీవంగా ఎన్నుకున్న బీసీసీఐ
  • కార్యదర్శిగా మరోసారి జైషాకే అవకాశం
  • ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా
  • ఐపీఎల్ చైర్మన్ గా ధుమాల్
బీసీసీఐలో గంగూలీ పాలన ముగిసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎన్నికయ్యారు. ముంబైలో మంగళవారం బీసీసీఐ ఏజీఎంలో ఈ ఎన్నిక జరిగింది. బీసీసీఐ ఏకాభిప్రాయంతో బిన్నీని అధ్యక్షుడిగా ఎన్నుకుంది. బీసీసీఐ సెక్రటరీగా మరోసారి జైషానే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా రాజీవ్ శుక్లా, జాయింట్ సెక్రటరీగా దేవజిత్ సైకియా, ఇప్పటి వరకు ట్రెజరర్ గా పనిచేసిన అరుణ్ ధుమాల్ నూతన ఐపీఎల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. రోజన్ బిన్నీ 1983లో భారత్ కు ప్రపంచ కప్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్. తన బౌలింగ్ నైపుణ్యాలతో (రైట్ ఆర్మ్ మీడియం పేసర్) 18 వికెట్లు తీసి, విజయాల్లో కీలక పాత్ర పోషించారు. తన కెరీర్ లో భారత్ తరఫున 27 టెస్ట్ మ్యాచుల్లో, 72 వన్డే మ్యాచుల్లో పాల్గొన్నారు. నేషనల్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 67 ఏళ్ల బిన్నీ స్వస్థలం బెంగళూరు.


More Telugu News