మెగాస్టార్ కష్టం నాకు తెలుసు: సీనియర్ నటుడు నరసింహరాజు
- నిన్నటి తరం హీరోగా నరసింహరాజుకి మంచి పేరు
- 'అనుకోని ప్రయాణం' సినిమాతో రీ ఎంట్రీ
- చిరంజీవి గురించిన ప్రస్తావన
- ఆయనపై ప్రశంసలు కురిపించిన నరసింహరాజు
నరసింహరాజు .. నిన్నటి తరం హీరోగా తెలుగు తెరకి పరిచయమైన ఆయన, జానపద కథానాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ మినహా మిగతా సీనియర్ స్టార్స్ తో కలిసి ఆయన నటించారు. సుదీర్ఘ కాలం పాటు కేరక్టర్ ఆర్టిస్టుగా కొనసాగిన ఆయన, సినిమాలలో అవకాశాలు తగ్గడంతో సీరియల్స్ పై ఎక్కువగా దృష్టి పెడుతూ వచ్చారు. చాలా కాలం తరువాత ఆయన 'అనుకోని ప్రయాణం' సినిమా చేశారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. చిరంజీవిగారితో కలిసి పని చేశాను. ఆయన ఈ రోజున మెగాస్టార్ గా ఇంతటి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. చిరంజీవిగారి సినిమాలు చూస్తుంటే, ఆయనతో కలిసి పనిచేసినందుకు ఆనందం కలుగుతూ ఉంటుంది. ఈ జనరేషన్ కి సంబంధించిన హీరోల సినిమాలను కూడా చూస్తూనే ఉంటాను. అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు" అని అన్నారు.
'ఆది పురుష్' ట్రైలర్ చూశాను .. రాముడిగా ప్రభాస్ బాగున్నాడు. ఇక రావణుడిగా నార్త్ వారు చేయడం వలన కొంత కొత్తగా అనిపిస్తుంది. రావణుడిగా ఎన్టీఆర్ .. ఎస్వీఆర్ వంటి వారిని చూసి అలవాటు పడిపోవడం వలన నార్త్ వారిని జీర్ణించుకోలేక పోవచ్చును. ఆ కాలంలో అలా .. ఈ కాలంలో ఇలా అనుకోవాలంతే. అయినా ట్రైలర్ చూసి మనం ఈ విషయాన్ని గురించి మాట్లాడటం కరెక్టు కాదేమో" అంటూ చెప్పుకొచ్చారు.