గల్ఫ్ దేశాల్లో మోహన్ లాల్ ‘మాన్ స్టర్’పై నిషేధం
- సినిమాలో ఎల్జీబీటీ కంటెంట్ పై అభ్యంతరం
- నిషేధ నిర్ణయం తీసుకున్న గల్ఫ్ దేశాలు
- సెన్సార్ బోర్డు రీ ఎవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకున్న నిర్మాత
ప్రముఖ నటుడు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మాన్ స్టర్’ సినిమాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ, ఈ లోపే గల్ఫ్ దేశాలు మాన్ స్టర్ ప్రదర్శనపై నిషేధం విధించాయి. ఈ సినిమాలో లెస్బేనియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ (ఎల్ జీబీ టీ క్యూ) కంటెంట్ ఉండడంతో నిషేధం విధించినట్లు తెలుస్తోంది.
చిత్ర నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ 'సెన్సార్ బోర్డ్ ఫర్ ఈ ఎవాల్యుయేషన్'కు సినిమా కాపీని అందించినట్టు తెలిసింది. ఒకవేళ బోర్డ్ నుంచి అనుమతి వస్తే వచ్చే వారం గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదల అవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ వారం విడుదలయ్యే అవకాశాల్లేవని తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్ లాల్ లక్కీ సింగ్ పాత్రలో కనిపించనున్నారు. కథను ఉదయ్ కృష్ణ అందించగా, వ్యాసక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లక్ష్మీ మంచు కూడా నటించింది.