బడ్జెట్ కార్లలోనూ 6 ఎయిర్ బ్యాగులు.. : నితిన్ గడ్కరీ
- అమలు దశలో ఉందన్న కేంద్ర రవాణా మంత్రి
- రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నట్టు ప్రకటన
- జనాభా, వాహనాల పెరుగుదల నియంత్రణలో లేని అంశాలని వ్యాఖ్య
ఎకానమీ కార్లలోనూ (బడ్జెట్ ధరల్లో) ఆరు ఎయిర్ బ్యాగులు ఉండాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్టు కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రహదారి భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా, వాహనాల పెరుగుదల అన్నవి నియంత్రణలో లేని రెండు అంశాలని వ్యాఖ్యానించారు. దేశంలో రోడ్డు ప్రమాదాలను సాధ్యమైనంత తగ్గించేందుకు ఆటోమొబైల్ రంగంలో సమూల మార్పు కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఎకానమీ కార్ల తయారీ సంస్థల వైఖరిని మంత్రి ఇటీవలే ప్రశ్నించడం గమనార్హం. ‘‘అదే కంపెనీ ఎగుమతి చేసే కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులు ఏర్పాటు చేస్తుంది. కానీ, స్థానిక మార్కెట్ కోసం చేసే కార్లలో నాలుగు బ్యాగులే ఏర్పాటు చేస్తోంది. పేదల ప్రాణాలు కాపాడడానికి అర్హమైనవి కావా?’’ అని మంత్రి నిలదీశారు. అన్ని కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం అమలు దశలో ఉన్నట్టు మంత్రి గడ్కరీ తెలిపారు. ఇటీవలే టాటా గ్రూపు మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.