భారత్‌లో ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్.. దీపావళి తర్వాత కేసులు పెరగొచ్చని నిపుణుల అంచనా
- గుజరాత్ రాష్ట్రంలో కొత్త వేరియంట్ ను గుర్తించిన అధికారులు
- శరీరంలో రోగ నిరోధక శక్తికి దొరకకుండా వ్యాపిస్తోందన్న నిపుణులు
- ఈ వేరియంట్ కారణంగానే ఇటీవల చైనాలో కేసులు పెరిగాయని వివరణ
కరోనాలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ వేరియంట్ లో మరో సబ్ వేరియంట్ భారతదేశంలోకి ప్రవేశించినట్టు గుర్తించారు. బీఎఫ్.7 గా పిలుస్తున్న ఈ వేరియంట్ చైనాలోని మంగోలియా ప్రాంతంలో మొదలైందని.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇది మన రోగ నిరోధక శక్తిని, వ్యాక్సిన్ల వల్ల వచ్చిన ఇమ్యూనిటీని కూడా తప్పించుకుని వ్యాపిస్తోందని పేర్కొంటున్నారు. దీనివల్ల వ్యాధి లక్షణాలు తక్కువగానే ఉన్నాయని.. కానీ వృద్ధులు, పిల్లలు, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రమాదకరంగా మారొచ్చని హెచ్చరిస్తున్నారు.
దీపావళి నాటికి కేసులు పెరిగే అవకాశం
ఇటీవల గుజరాత్ లో ఒమిక్రాన్ బీఏ.5.1.7 వేరియంట్ తోపాటు అత్యంత విస్తరణ సామర్థ్యం కలిగిన బీఎఫ్.7 వేరియంట్ ను గుర్తించినట్టు గుజరాత్ బయో టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీన గుర్తించిన ఈ వైరస్ అతితక్కువ రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నట్టుగా తేలిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త వేరియంట్లను ‘ఒమిక్రాన్ స్పాన్’ అని పిలుస్తున్నారని తెలిపారు.
చైనాలో బాగా విస్తరించిన ఈ కొత్త వేరియంట్లు.. అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాల్లో కూడా ప్రభావం చూపుతున్నాయని వివరించారు. అయితే వీటి ప్రభావంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దీపావళి తర్వాత దేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని పలువురు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
చలికాలం.. జాగ్రత్త అవసరం
కరోనా సోకి తగ్గడం, వ్యాక్సిన్ల ద్వారా ఇప్పటికే శరీరానికి సమకూరిన ఇమ్యూనిటీని ఈ కొత్త వేరియంట్ సులువుగా తప్పించుకుని వ్యాప్తి చెందుతోందని నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు దేశంలో చలికాలం మొదలవుతున్న నేపథ్యంలో.. జాగ్రత్తగా ఉండటం అవసరమని స్పష్టం చేస్తున్నారు.
చలికాలంలో ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి మరింత ఇబ్బంది పెరుగుతుందని.. న్యూమోనియా, ఆస్తమా వంటివి ఉన్నవారు కరోనా బారినపడితే ఇబ్బంది మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఒక్కోసారి ప్రమాదకరంగా మారే అవకాశమూ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు, ఇతర జాగ్రత్తలను పాటించడం అవసరమని స్పష్టం చేస్తున్నారు.