మా ఆస్తిపాస్తులు ఎలా కరిగిపోయాయంటే..!: నటి తులసి
- బాలనటిగా తెరకి పరిచయమైన తులసి
- హీరోయిన్ గాను మెరిసిన తీరు
- కేరక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీ
- తన తల్లి మంచితనం వల్లనే ఆస్తులు పోయాయని వెల్లడి
బాలనటిగా అనేక చిత్రాలలో నటించి మెప్పించిన తులసి ఆ తరువాత హీరోయిన్ వేషాల వైపు వెళ్లినప్పటికీ, చివరికి కేరక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ, ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగానే ఉన్నారు. తెలుగు సినిమాల నుంచి అవకాశాలు ఎక్కువగా వెళుతుండటం వలన, ఆమె చెన్నై నుంచి హైదరాబాదుకి షిఫ్ట్ అయ్యారు. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"మా అమ్మగారికి మహానటి సావిత్రి గారితోను .. అంజలీదేవిగారితోను మంచి స్నేహం ఉండేది. తరచూ తనతో పాటు ఆమె నన్ను వారి ఇంటికి తీసుకుని వెళుతూ ఉండేది. అలా నన్ను చూసిన సావిత్రిగారు బాలనటిగా పరిచయం చేయమని అమ్మను ఒత్తిడి చేశారు. బాలనటిగా నా నటనను చూసిన సావిత్రి గారు, నేను తప్పకుండా మంచి ఆర్టిస్టును అవుతానని అమ్మతో చెప్పారట. ఆమె అలా అనడం వల్లనే అమ్మ కూడా నన్ను నటన వైపుకు నడిపించడానికి ఉత్సాహాన్ని చూపించారు.
నా చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారు. మా అమ్మగారికి మంచితనం ఎక్కువ. చాలామంది సినిమా వాళ్లు మా ఇంట్లో అద్దెకి ఉన్నవాళ్లే. వాళ్లు పెద్దగా రెంట్ ఇచ్చుకోలేరని తెలిసి కూడా పట్టించుకునేవారు కాదు. ఇంట్లో ఏది చేసినా ఆ వీధిలో ఉన్నవాళ్లదరికీ పంపించేవారు .. పంచేసేవారు. ఎవరైనా ఏదైనా బాగుంది అంటే .. వెంటనే ఇచ్చేసేవారు. ఆమె మంచితనం వల్లనే ఆస్తి అంతా కూడా కరిగిపోయింది. ప్యాషన్ తో నటన వైపుకు వెళ్లిన నాకు, ఆ తరువాత నటన అవసరమైపోయింది" అంటూ చెప్పుకొచ్చారు.