హిప్పోపోటమస్‌ వెంట ఏనుగు పడితే.. వైరల్‌ వీడియో ఇదిగో

  • ఆఫ్రికాలోని ఓ నేషనల్ పార్క్ లో ఇటీవల ఘటన
  • నీటి గుంటలో ఉన్న హిప్పోను గట్టిగా అరుస్తూ ఆగ్రహంతో వెంటపడిన ఏనుగు
  • భయంతో పారిపోయిన హిప్పో.. దూరంగా ఉన్న మరో హిప్పో కూడా పరారు
  • యూట్యూబ్ లో వీడియో వైరల్.. హిప్పో ఇలా భయపడటం చూడలేదంటూ నెటిజన్ల కామెంట్లు
హిప్పోపోటమస్ అంటే నీటి ఏనుగు, అసలైన ఏనుగు. రెండింటి పేర్లలోనూ ఏనుగు అనే ఉన్నా.. రెండింటికీ ఎంతో తేడా ఉంటుంది. నిజానికి రెండూ ప్రశాంతమైన జంతువులే. అందులో నీటి ఏనుగు అయితే ఎప్పుడూ స్తబ్దుగా ఓ చోట ప్రశాంతంగా ఉన్నట్టే ఉంటుంది. అయితే ఏం గొడవ వచ్చిందో ఏమోగానీ..  ఓ నీటి గుంటలో ఉన్న హిప్పోపై ఏనుగు ఆగ్రహంతో వెంటపడి తరిమిన వీడియో మాత్రం భలేగా ఆకట్టుకుంటోంది.

నీటి గుంటలో ఉండగా..
ఓ హిప్పో నీటి గుంటలో ఉండగా.. ఓ ఏనుగు ఆగ్రహంతో దానివైపు పరుగెత్తుతూ వచ్చింది. గట్టిగా అరుస్తూ.. నీటిలోకి దిగి మరీ వెంటపడింది. హిప్పో భయంతో పారిపోవడం మొదలుపెట్టింది. అసలే నీళ్లు, ఆపై బురద రెండూ ఉండటంతో హిప్పో, ఏనుగు రెండూ గట్టిగా పరుగెత్తలేకపోయాయి. అయితే ఈ ఘటన చూస్తూ.. కాస్త దూరంలో ఉన్న మరో హిప్పో కూడా భయంతో పరుగెట్టడం వీడియోలో కనిపిస్తోంది.
  • ఆఫ్రికాలోని పిలేన్స్ బర్గ్ నేషనల్ పార్క్ లో ఇటీవల ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు దీనిని వీడియో తీశారు. దీనిని ‘లేటెస్ట్ సైటింగ్స్’ పేరిట ఉన్న యూట్యూబ్ చానల్ లో అప్ లోడ్ చేయగా వైరల్ గా మారింది.
  • ఈ వీడియోకు ఇప్పటివరకు 87 వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. వేలకొద్దీ లైకులు వస్తున్నాయి. “ఆ నీటి ఏనుగును ఏదో చేసే ఉంటుంది. లేకుంటే ఏనుగుకు ఎందుకంత కోపం వస్తుంది..” అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
  • ‘‘నీటి ఏనుగును అసలైన ఏనుగు పరుగుపెట్టిస్తే ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా” అని మరికొందరు పేర్కొంటున్నారు. ‘‘నీటి ఏనుగే అని కాదు పులి వచ్చినా ఏనుగును చూసి పారిపోవాల్సిందే.. అడవికి అసలైన రారాజులు ఏనుగులే..” అని ఇంకొందరు అంటున్నారు.
  • ఇక మామూలుగా హిప్పోలు ఇలా పరుగెత్తడం ఎప్పుడూ చూడలేదని.. అవి అంతగా భయపడటం అరుదేనని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


More Telugu News