'సర్దార్'తో లైలా రీ ఎంట్రీ పట్ల కార్తి స్పందన!

  • కార్తి హీరోగా రూపొందిన 'సర్దార్'
  • కథనాయికగా రాశి ఖన్నా 
  • ముఖ్యమైన పాత్రలో లైలా 
  • ఈ నెల 21వ తేదీన సినిమా విడుదల   
కార్తి కథానాయకుడిగా 'సర్దార్' సినిమా రూపొందింది. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి, పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. డిఫరెంట్ లుక్ తో ఈ సినిమాలో కార్తి కనిపించనున్నాడు. ఆయన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రెండు పాత్రల మధ్య వైవిధ్యం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో కార్తి మాట్లాడుతూ .. 'సర్దార్' యాక్షన్ ప్రధానంగా సాగే ఎమోషనల్ డ్రామా. ఇంతవరకూ నేను చేసిన పాత్రలకి ఈ సినిమాలో చేసిన పాత్ర భిన్నంగా ఉంటుంది. ఇలా కదా మనం కార్తిని చూడాలనుకున్నది అనుకుంటారు. హీరోయిన్స్ గా రాశి ఖన్నా - రజీషా విజయన్ కి కూడా ప్రాధాన్యత కలిగిన పాత్రలు దక్కాయి. 

ఇక 14 ఏళ్ల తరువాత ఈ సినిమాతో లైలా రీ ఎంట్రీ ఇవ్వడం నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. ఈ సినిమాకి తన పాత్ర చాలా కీలకం. ఆమె పాత్ర ద్వారానే కథ మలుపు తిరుగుతుంది. ఇక జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం .. ఫొటోగ్రఫీ .. సెట్ వర్క్ అంతా కూడా అద్భుతంగా కుదిరాయి. రెండేళ్లపాటు స్క్రిప్ట్ పై కూర్చున్నాము .. ఏడాది పాటు షూటింగు చేశాము. అందుకు తగిన ఫలితాన్ని ఈ సినిమా రాబడుతుందనే నమ్మకం ఉంది" అంటా చెప్పుకొచ్చారు.


More Telugu News