స్విగ్గీలో ఉద్యోగం తెచ్చుకున్న తండ్రి, పట్టరాని సంతోషంలో కూతురు.. వీడియో వైరల్

  • కళ్లు మూసుకున్న కూతురు ముందుకు స్విగ్గీ టీషర్ట్ తో వచ్చిన తండ్రి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో 
  • తండ్రీకూతుళ్ల స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం అని కామెంట్లు
తండ్రీ కూతుళ్ల బంధం మాటల్లో చెప్పలేనంత స్వచ్ఛమైనది. అతి ఎంత స్వచ్ఛమైనదో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. స్విగ్గీలో కొత్త ఉద్యోగం సంపాదించి ఇంటికి తిరిగొచ్చిన తండ్రిని చూసి ఆనందంతో గంతులేసిన అమ్మాయి వీడియో క్లిప్ ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. దీన్ని చూస్తే మన కళ్లు కూడా చెమర్చవచ్చు. నెట్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోను పూజా అవంతిక అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 

హృదయాన్ని హత్తుకునే ఈ క్లిప్‌లో ఒక చిన్న అమ్మాయి తన చేతులతో కళ్లు మూసుకోగా.. ఆమె తండ్రి స్విగ్గీ టీ-షర్ట్‌తో తన ముందుకొచ్చాడు. కళ్లు తెరిచిన ఈ చిన్నారి తన తండ్రికి స్విగ్గీలో కొత్త ఉద్యోగం వచ్చిందని గ్రహించింది. అంతే.. ఆనందంతో ఎగిరి గంతులేసింది. పట్టరాని సంతోషంతో తండ్రిని హత్తుకుంది. ఆన్‌లైన్‌లో షేర్ చేసిన తర్వాత ఈ వీడియోకు మిలియన్ వ్యూస్ లభించాయి. అమ్మాయి రియాక్షన్ చూసి నెటిజన్లు సైతం చాలా సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.


More Telugu News