నయనతార, విఘ్నేశ్ సరోగసిలో ట్విస్ట్.. ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్!

  • కొత్త విషయాన్ని బయటపెట్టిన నయన్ దంపతులు
  • ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నట్టు తమిళనాడు ప్రభుత్వ కమిటీకి వెల్లడి
  • వివాహ సర్టిఫికెట్, అఫడవిట్ సమర్పణ
సరోగసీతో కవలలకు జన్మనిచ్చి, విమర్శలు ఎదుర్కొంటున్న నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. పెళ్లయిన నాలుగు నెలలకే వీరు తల్లిదండ్రులయ్యారు. దీంతో పెళ్లికి ముందే వేరొక మహిళ గర్భాన్ని అద్దెకు ఎలా తీసుకుంటారు? ఇది చట్ట విరుద్ధమైన చర్య కదా? అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై విచారణకు తమిళనాడు ప్రభుత్వం ఓ కమిటీని సైతం నియమించింది. 

దీంతో ఇన్నాళ్లూ ఒక విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచి పెట్టిన నయన్ దంపతులు ఎట్టకేలకు దాన్ని బయటపెట్టారు. తమ వివాహాన్ని ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ చేసుకున్నట్టు అఫిడవిట్ సమర్పించారు. సరోగసీ విధానంలో కవలలకు జన్మనివ్వడంపై వస్తున్న విమర్శలకు అఫిడవిట్ రూపంలో పుల్ స్టాప్ పెడదామన్నది దంపతుల ప్రయత్నంగా కనిపిస్తోంది. తమిళనాడు వైద్య శాఖ ఏర్పాటు చేసిన కమిటీకి తమ వివాహ సర్టిఫికెట్, అఫిడవిట్ ను విఘ్నేశ్, నయన్ సమర్పించినట్టు తెలిసింది.

విఘ్నేశ్, నయనతార 2015 నుంచి ప్రేమించుకుంటూ, సహ జీవనం కూడా చేశారు. ఈ విషయం అభిమాన లోకానికి ఎప్పటి నుంచో తెలుసు. కానీ అధికారికంగా వీరు ఈ ఏడాది జూన్ 9న వివాహం చేసుకున్నారు. అక్టోబర్ 9న కవలలకు తల్లిదండ్రులయ్యారు. సరోగసీ చట్టం ప్రకారం పెళ్లయిన ఐదేళ్ల వరకు పిల్లలు లేకపోతేనే ఈ విధానానికి అర్హులు. 


More Telugu News