విశాఖలో వైసీపీ మంత్రులపై దాడి కేసు.. 9 మందికి రిమాండ్.. 61 మంది జనసేన నాయకులకు బెయిలు
- రూ. 10 వేల పూచీకత్తుపై విడుదల చేసిన కోర్టు
- 9 మందికి ఈ నెల 28 వరకు రిమాండ్
- మొత్తం 92 మందిపై కేసులు పెట్టారన్న జనసేన
విశాఖ విమానాశ్రయం వద్ద వైసీపీ మంత్రులపై జరిగిన దాడి కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన జనసేన నాయకులు, కార్యకర్తలకు కోర్టులో ఊరట లభించింది. అరెస్ట్ అయిన వారిలో 61 మందిని రూ. 10 వేల పూచీకత్తుపై కోర్టు విడుదల చేయగా, 9 మందికి మాత్రం ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది.
కాగా, అంతకు ముందు అరెస్ట్ చేసిన నేతలను ఏడో అదనపు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వారిని కోర్టుకు తరలించే సమయంలో ప్రాంగణంలోని అన్ని గేట్లను మూసివేశారు. మరోవైపు, విశాఖ ఘటనకు సంబంధించి తమ జనసైనికులు 92 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి 70 మందిని అరెస్ట్ చేసినట్టు జనసేన లీగల్ టీమ్ పేర్కొంది. వీరిలో 61 మందికి బెయిలు లభించిందని, 9 మందికి కోర్టు రిమాండ్ విధించిందని తెలిపింది.