విష్ణు ఇకపై రిస్కీ షాట్లు చేయొద్దు: సున్నితంగా మందలించిన మోహన్ బాబు
- 'జిన్నా' ప్రీ రిలీజ్ ఈవెంటులో మోహన్ బాబు
- ఈ సినిమా టీమ్ పై ప్రశంసలు
- మీడియా మిత్రులకు కృతజ్ఞతలు
- ఈ నెల 21వ తేదీన రిలీజ్ కానున్న సినిమా
మంచు విష్ణు మొదటి నుంచి కూడా యాక్షన్ కామెడీ సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఈ సారి యాక్షన్ .. కామెడీతో పాటు, మోహన్ బాబు తరహా రొమాంటిక్ టచ్ కూడా ఇస్తున్నాడు. సొంత నిర్మాణంలో ఆయన చేసిన ఆ సినిమా పేరే 'జిన్నా'. జి. నాగేశ్వర రెడ్డి కథను అందించిన ఈ సినిమాకి, కోన వెంకట్ స్క్రీన్ ప్లేను సమకూర్చగా సూర్య దర్శకత్వం వహించాడు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళ .. హిందీ భాషల్లోను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదు - జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించారు.
ఈ వేదికపై మోహన్ బాబు మాట్లాడుతూ .. "దాదాపు 565 సినిమాలలో నటించాను .. 75 సినిమాలను నిర్మించాను. విష్ణు ఈ సినిమాలో ఎంతో గొప్పగా నటించాడనేది ఎందరో చెప్పారు. భగవంతుడి ఆశీస్సుల వలన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఏ సినిమా కోసం చేయని రిస్కీ షాట్లు ఈ సినిమా కోసం విష్ణు చేశాడు. ఇకపై అలా చేయవద్దని చెబుతున్నాను. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ అవుతుంది. ఈ సినిమాతో సూర్య పెద్ద దర్శకుడు అవుతాడని భావిస్తున్నాను.
ఈ సినిమాకి భాను - నందు రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఈ ఫంక్షన్ కి ఆలీ వచ్చాడు .. కాకపోతే డబ్బులు తీసుకుని వచ్చాడు అంటూ మోహన్ బాబు సరదాగా అన్నారు. అందుకు అలీ స్పందిస్తూ .. 'మోహన్ బాబు గారు లెజండరీ యాక్టర్ .. ఆయనంటే నాకు ఎంతో గౌరవం. ఆయన చూసింది ఎంతో. ఆయన పట్ల అభిమానంతో ఈ రోజున ఇక్కడికి వచ్చాను" అంటూ చెప్పుకొచ్చాడు. మీడియా తన పట్ల చూపుతున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మోహన్ బాబు తన ప్రసంగాన్ని ముగించారు.