నేను అనుకున్న విష్ణు వేరు .. నేను చూసిన విష్ణు వేరు: చోటా కె నాయుడు
- మంచు విష్ణు హీరోగా రూపొందిన 'జిన్నా'
- హీరోయిన్స్ గా పాయల్ - సన్నీలియోన్
- సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్
- ఈ నెల 21వ తేదీన సినిమా రిలీజ్
టాలీవుడ్ సినిమాలకి సంబంధించి సీనియర్ సినిమాటోగ్రఫర్ గా చోటా కె నాయుడికి మంచి పేరు ఉంది. ఆయన పనిచేసిన ఎన్నో సినిమాలు విజయవంతమయ్యాయి. అలాంటి చోటా కె నాయుడు మొదటిసారిగా మంచు విష్ణు సినిమా 'జిన్నా'కి పనిచేశాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ .. "ఈ కథను కోన వెంకట్ గారు చెప్పగానే నాకు నచ్చేసింది. సెకండాఫ్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో హీరో విష్ణు అని కోన అప్పుడు చెప్పాడు. నిర్మాత మోహన్ బాబు దగ్గరికి వెళదామంటే నేను కాస్త టెన్షన్ పడ్డాను. ఎందుకంటే మా అందరికీ ఆయనంటే ఒక భయం ఉంది" అన్నాడు.
"మోహన్ బాబుగారి బ్యానర్లో ఇంతవరకూ ఎన్నో సూపర్ హిట్లు వచ్చాయి గానీ, నేను మాత్రం పనిచేయలేదు. ఎందుకంటే నేనంటే ఆయన కాస్త కోపంగా ఉండేవారు. కానీ ఈ సినిమా కోసం నేను వెళ్లినప్పుడు ఎంతో ఆత్మీయంగా పలకరించారు. ఈ సినిమా విషయంలో నాకు ఎంతో స్వేచ్చ ఇచ్చారు. నన్ను మరో కొడుకుగా చూసుకున్నారు. లొకేషన్లో విష్ణు ఏమైనా నస పెడతాడేమోనని అనుకున్నాను. కానీ ఏ విషయంలోను ఆయన జోక్యం చేసుకోలేదు. నేను అనుకున్న విష్ణు వేరు .. నేను చూసిన విష్ణు వేరు. సినిమా కోసం విష్ణు ఎంత రిస్క్ అయినా తీఎసుకుంటాడు. ఆయన కాలుకి గాయం కావడానికి కారణం కూడా అదే. ఇకపై అంత రిస్క్ చేయవద్దనే నేను విష్ణుకు చెబుతున్నాను.
ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది .. ఆ నమ్మకం నాకు ఉంది. ఈ సినిమా హిట్ మోహన్ బాబుకి విష్ణు ఇచ్చే గిఫ్ట్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా డైరెక్టర్ సూర్యలో ఒక క్రాంతిగారు .. ఒక జంధ్యాల గారు ఉన్నారు. కోన నన్ను తీసుకుని వెళ్లి మోహన్ బాబు గారి దగ్గర ఇరికించేశాడు అనుకున్నాను. కానీ కోన చేయడం వలన నాకు మరో ఆస్తి దొరికినట్టు అయింది" అంటూ చెప్పుకొచ్చాడు.