రేపు నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటన
- రైతు భరోసా రెండో విడత నిధుల విడుదల
- ఆళ్లగడ్డలో కార్యక్రమం
- బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం
సీఎం జగన్ రేపు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఆళ్లగడ్డలో జరిగే వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరతారు. ఉదయం 10.15 గంటలకు ఆళ్లగడ్డ చేరుకుంటారు. 10.45 గంటలకు ప్రభుత్వ జేఆర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ రెండో విడత నిధులను బదిలీ చేస్తారు.
ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12.10 గంటలకు పూర్తవుతుంది. అనంతరం సీఎం జగన్ 12.35 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.