హీరోయిన్ గా చేయడమే నేను చేసిన పొరపాటేమో: గీతా సింగ్
- 'కితకితలు' సినిమాతో మెప్పించిన గీతా సింగ్
- ఇటీవల కాలంలో తెరపై కనిపించని హాస్య నటి
- అవకాశాలు లేవంటూ ఆవేదన
- ఈవీవీ ఉంటే బాగుండేదనే అభిప్రాయం
టాలీవుడ్ లో శ్రీలక్ష్మి తరువాత కామెడీని పరిగెత్తించిన హాస్యనటిగా గీతా సింగ్ కనిపిస్తుంది. గీతా సింగ్ పేరు వినగానే 'ఎవడి గోల వాడిది' .. 'కితకితలు' వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. అలాంటి గీతా సింగ్ చాలా కాలంగా తెరపై కనిపించడం లేదు. ఆమెకి అవకాశాలు రావడం లేదా? లేదంటే ఆమెనే చేయడం లేదా? అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతా సింగ్ మాట్లాడుతూ అందుకుగల కారణాలను గురించి ప్రస్తావించింది.
కొత్తగా వచ్చిన దర్శకులు అవకాశాలు ఇవ్వడం లేదు. ఎందుకని ఇవ్వడం లేదు అని అడిగితే, 'మీరు ఆ ల్రెడీ హీరోయిన్ గా చేసి ఉన్నారు .. మీ స్థాయికి తగిన వేషాలు లేవు మేడమ్' అంటున్నారు. నాతో ఇంత చిన్న వేషాలు వేయించలేమని చెబుతున్నారు. దాంతో హీరోయిన్ గా చేయడం నేను చేసిన పొరపాటేమో అని నాకు అనిపిస్తోంది. అవకాశాలు రావడం లేదని నేను బాధపడుతుంటే, నేనే చేయడం లేదని జనాలు అనుకుంటున్నారు.
నిజానికి నాకు యాక్టింగ్ రాదు .. నా మదర్ టంగ్ కూడా హిందీ. అలాంటి నాతో వేషాలు వేయించి ప్రోత్సహించింది ఈవీవీ సత్యనారాయణ గారు. ఇక నటన పరంగా అల్లరి నరేశ్ గారు కూడా నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. ఆ ఇద్దరూ లేకపోతే ఈ రోజున ఇక్కడ గీతా సింగ్ ఉండేది కాదు. ఈవీవీ గారు ఉంటే నాలాంటి ఆర్టిస్టులకు ఎంతోమందికి ఒక పండుగలా ఉండేది. ఆయన లేకపోవడం తీరని లోటు .. నాలాంటివారు చాలామంది వెనుకబడిపోయారు" అంటూ ఆవేదనను వ్యక్తం చేసింది.