3 సార్లు పెళ్లి చేసుకున్నానని అసూయ పడుతున్నట్టున్నారు... విడాకులిచ్చి మీరూ చేసుకోండి: పవన్ కల్యాణ్
- విశాఖలో మీడియాతో మాట్లాడిన పవన్
- పవన్ పై వైసీపీ విమర్శలను ప్రస్తావించిన మీడియా ప్రతినిధి
- తన 3 పెళ్లిళ్లపై వారు అసూయపడుతున్నట్లుందన్న పవన్
- విడాకులిచ్చి వారూ 3 పెళ్లిళ్లు చేసుకుంటే తనకేమీ ఇబ్బంది లేదని వెల్లడి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను చేసుకున్న 3 పెళ్లిళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కోసం విశాఖ వచ్చిన పవన్... ఆదివారం ఉదయం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ నటన నేర్చుకోవడానికి విశాఖ కావాలి, పెళ్లి చేసుకునే అమ్మాయిని ఇవ్వడానికి విశాఖ కావాలి...కాని రాజధానిగా మాత్రం విశాఖ వద్దా? అంటూ విశాఖ గర్జనలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించారు. ఈ ప్రశ్నకు స్పందించిన పవన్ ఆసక్తికర కామెంట్లు చేశారు.
''నేను 3 పెళ్లిళ్లు చేసుకున్నానని వారు అసూయ పడుతున్నట్లున్నారు... వారినీ 3 పెళ్లిళ్లు చేసుకోమనండి. నాకేమీ అభ్యంతరం లేదు. నాకు కుదరలేకనే 3 పెళ్లిళ్లు చేసుకున్నాను. పొద్దాక తన పెళ్లిళ్లపై మాట్లాడే వారిని చూస్తుంటే... తాను 3 పెళ్లిళ్లు చేసుకున్నానని వారు అసూయ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. వారిని కూడా విడాకులు ఇచ్చి 3 పెళ్లిళ్లు చేసుకోమనండి. నాకేమీ ఇబ్బంది లేదు. అలాగైతే నేను 3 పెళ్లిళ్లు చేసుకున్న చోట 3 రాజధానులు పెడతారా? నేను ముంబైలో నటన నేర్చుకున్నాను. మరి అక్కడ రాజధాని పెడతారా?'' అంటూ పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.