మాజీ మంత్రి పితాని సహా జనసేన కీలక నేతల అరెస్ట్
- శనివారం రాత్రి నోవాటెల్ కు వచ్చిన జనసైనికుల అరెస్ట్
- వందల మందిని అరెస్ట్ చేశారన్న పవన్ కల్యాణ్
- పవన్ ను కలిసేందుకు వచ్చిన మాజీ మంత్రి పితాని
- పితాని, పంతం నానాజీ సహా కీలక నేతల అరెస్ట్
విశాఖలో జనసేన నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్ర పర్యటన నిమిత్తం శనివారమే పవన్ కల్యాణ్ విశాఖ చేరగా... పవన్ కు స్వాగతం చెప్పేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన జనసైనికులు ఆ సమయంలో ఎయిర్ పోర్టుకు వచ్చిన మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడి చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ క్రమంలో గంటలో ముగియాల్సిన పవన్ ర్యాలీ 4 గంటలకు పైగా సాగింది.
ఆ తర్వాత పవన్ తను బస చేసే నోవాటెల్ హోటల్ కు చేరుకున్న తర్వాత పవన్ వద్దకు వచ్చిన పలువురు జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పార్టీకి చెందిన వందల మందిని పోలీసులు అకారణంగా అరెస్ట్ చేశారని కూడా పవన్ ఆరోపించారు. తాజాగా విశాఖలో పవన్ కల్యాణ్ ను కలిసేందుకు వచ్చిన కీలక నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణతో పాటు పంతం నానాజీ, బోనబోయిన శ్రీనివాస యాదవ్, చిలకం మధుసూదన్ రెడ్డి, నయూబ్ కమల్, షేక్ రియాజ్, శెట్టిబత్తుల రాజబాబు తదితరులు ఉన్నారు.