సూపర్ సైక్లోన్ ఏర్పడుతుందన్నది వట్టి పుకారు మాత్రమే: ఐఎండీ
- బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ అంటూ ప్రచారం
- తాము ఎలాంటి ప్రకటన చేయలేదన్న ఐఎండీ
- పేరు పెట్టినట్టు వస్తున్న వార్తల్లోనూ నిజంలేదని వెల్లడి
బంగాళాఖాతంలో ఈ నెల 20న అల్పపీడనం ఏర్పడనుందని, అది క్రమేపీ బలపడి పెను తుపానుగా మారనుందని కథనాలు రావడం తెలిసిందే. దీనిపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) స్పందించింది. సూపర్ సైక్లోన్ గురించి జరుగుతున్న ప్రచారం వట్టి పుకారు మాత్రమేనని ఐఎండీ స్పష్టం చేసింది. ఆ తుపానుకు 'సిత్రాంగ్' అని నామకరణం చేసినట్టు వస్తున్న వార్తల్లోనూ నిజంలేదని పేర్కొంది.
దీనిపై ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.మహాపాత్ర స్పందించారు. బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ ఏర్పడుతుందని, అది భారత తీరాన్ని తాకుతుందని వస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. సూపర్ సైక్లోన్ కు సంబంధించి తాము ఎలాంటి ప్రకటన చేయలేదని వెల్లడించారు.
కాగా, కెనడాలోని సస్కాచెవాన్ యూనివర్సిటీలో వాతావరణ శాస్త్రంలో పీహెచ్ డీ చేస్తున్న ఓ విద్యార్థి బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ ఏర్పడనుందన్న అంచనాలు వెలువరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పుకార్లు బయల్దేరినట్టు అర్థమవుతోంది.