పవన్ కల్యాణ్ రాజకీయ శిఖండిలా మారారు: మంత్రి గుడివాడ అమర్ నాథ్
- విశాఖలో నేడు ఉద్రిక్త పరిస్థితులు
- తమ మంత్రులపై దాడి జరిగిందన్న గుడివాడ అమర్ నాథ్
- ఈ దాడికి పవన్ కల్యాణ్ దే బాధ్యత అని వ్యాఖ్య
- జనసైనికులా, జనసైకోలా అంటూ ఆగ్రహం
విశాఖలో ఈ సాయంత్రం జరిగిన పరిణామాలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. విశాఖ గర్జన రోజునే పవన్ కల్యాణ్ పర్యటన పెట్టుకోవడం ఏంటని మండిపడ్డారు. ఇవాళ తమ మంత్రులు, టీటీడీ చైర్మన్ పై దాడి జరిగిందని, ఈ దాడికి పవన్ కల్యాణ్ బాధ్యత వహించాలని అన్నారు.
చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తూ పవన్ ఒక రాజకీయ శిఖండిలా మారారని విమర్శించారు. పవన్ పవర్ స్టార్ కాదని, ఫ్లవర్ స్టార్ అని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ నుంచే జనసైనికులకు కూడా సైకో మనస్తత్వం వచ్చిందని వ్యాఖ్యానించారు. వాళ్లు జనసైనికులా? జనసైకోలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ దాడికి పాల్పడ్డారని మంత్రి అమర్ నాథ్ ఆరోపించారు. ఇది ఉత్తరాంధ్ర ఉద్యమంపై జరిగిన దాడిగానే భావిస్తామని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంటుపై పవన్ కు గౌరవం లేదా? అని నిలదీశారు. గాజువాకలో తనను ఓడించారన్న కసితో ఉత్తరాంధ్ర ప్రజలపై కక్ష కట్టారా? అని ప్రశ్నించారు.