శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేసిన రష్యా దేశస్థులు

  • శ్రీకాళహస్తికి విచ్చేసిన రష్యా దేశస్థులు
  • ముక్కంటికి పూజలు
  • అమ్మవార్లను కూడా సందర్శించిన వైనం
  • ఆలయ శిల్ప కళ పట్ల అచ్చెరువొందిన రష్యన్లు
భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు, హిందూ మతం పట్ల విదేశీయులు ఆకర్షితులవడం కొత్తేమీ కాదు. పాశ్చాత్య దేశాలకు చెందినవారు వేదాలను అధ్యయనం చేయడం, భారతీయ పురాణ, ఇతిహాసాలను చదవడం, భారతీయ నాట్య కళలు, కర్ణాటక, హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాలను నేర్చుకోవడం తెలిసిందే. ఇప్పటికీ అనేక దేశాలకు చెందిన వారు భారత్ లో పర్యటిస్తూ, ఇక్కడి ఆలయాలను, సుప్రసిద్ధ పర్యాటక స్థలాలను సందర్శిస్తుంటారు. 

తాజాగా రష్యాకు చెందిన ఓ భక్తుల బృందం ఏపీలోని శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి విచ్చేసింది. ఈ శైవక్షేత్రానికి విచ్చేసిన రష్యా దేశస్థులు రాహుకేతు పూజలు చేశారు. ఆలయ సిబ్బంది వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. 

ఈ రష్యా బృందంలో 25 మంది సభ్యులు ఉన్నారు. శ్రీకాళహస్తి ఆలయ సౌందర్యాన్ని వీక్షించిన వారు ముగ్ధులయ్యారు. ఇక్కడి శిల్ప కళ అద్భుతమని కొనియాడారు. ఇక్కడి అమ్మవార్లను కూడా దర్శించుకుని పూజలు చేశారు.
.


More Telugu News