వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్ లపై జనసైనికుల దాడి పట్ల పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి: అంబటి రాంబాబు

  • విశాఖలో హైటెన్షన్
  • నేడు వైసీపీ గర్జన సభ
  • మూడ్రోజుల పర్యటనకు పవన్ విశాఖ రాక
  • ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత
ఇవాళ విశాఖలో వైసీపీ గర్జన ఏర్పాటు చేయగా, అదే సమయంలో పవన్ కల్యాణ్ పర్యటనకు వస్తుండడం ఉద్రిక్తతలకు దారితీసింది. వైజాగ్ ఎయిర్ పోర్టు నుంచి వెళుతున్న మంత్రులు జోగి రమేశ్, రోజా, వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డిల వాహనాలపై జనసేన కార్యకర్తలు దాడి చేసినట్టు వైసీపీ ఆరోపిస్తోంది.

దీనిపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్ లపై విశాఖ ఎయిర్ పోర్టు వద్ద జనసైనికులు దాడి చేశారంటూ ట్వీట్ చేశారు. ఈ దాడి ఘటనపై పవన్ కల్యాణ్ తక్షణమే సమాధానం చెప్పాలని నిలదీశారు. 

కాగా, దాడి ఘటనలో మంత్రి రోజా సహాయకుడికి కూడా గాయాలైనట్టు వైసీపీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా పంచుకుంది. మంత్రి జోగి రమేశ్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయని తెలిపింది.


More Telugu News