నాటో దళాలు రష్యా సైన్యంతో తలపడితే ప్రపంచ వినాశనమే: పుతిన్
- ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర
- ఉక్రెయిన్ కు నాటో దేశాల మద్దతు
- తీవ్రంగా స్పందించిన పుతిన్
- రష్యా బలగాలను ఢీకొట్టే సాహసం చేయొద్దని హెచ్చరిక
ఉక్రెయిన్ కు కొమ్ము కాస్తున్న నాటో దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర హెచ్చరికలు చేశారు. నాటో దళాలు రష్యా సైన్యంతో తలపడితే ప్రపంచ వినాశనం తప్పదని అన్నారు. నేరుగా రష్యా బలగాలను ఢీకొట్టే సాహసం చేయొద్దని హెచ్చరించారు.
కజకిస్థాన్ పర్యటనలో ఉన్న పుతిన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే యుద్ధం గురించి మాట్లాడుతున్న నాటో పెద్దలు తెలివిగా ఆలోచిస్తారని భావిస్తున్నానని, ఆ దిశగా ముందడుగు వేయరని పుతిన్ పేర్కొన్నారు.
ఇటీవల పుతిన్ తరచుగా అణు యుద్ధం గురించి మాట్లాడుతుండడాన్ని జీ-7 దేశాలు హెచ్చరికలుగానే భావిస్తున్నాయి. అందుకే, ఉక్రెయిన్ పై అణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు, జీవాయుధాలు ప్రయోగిస్తే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జీ-7 దేశాలు పుతిన్ ను హెచ్చరించాయి.
అటు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎక్కడ ముగించాలనుకుంటున్నారో అని వ్యాఖ్యానించారు.