నితీశ్ కుమార్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం
- గంగానదిలో పూజా ఘాట్ల పరిశీలనకు వెళ్లిన నితీశ్
- బ్రిడ్జ్ పిల్లర్ ను ఢీకొన్న పడవ
- ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయపడిన వైనం
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మరికొందరితో కలిసి ఆయన పడవలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం సంభవించింది. గంగానదిలో నిర్మాణంలో ఉన్న జేపీ సేతు బ్రిడ్జ్ పిల్లర్ ను పడవ ఢీకొంది. అయితే, ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
గంగానదిలో ఉన్న ఛాత్ పూజా ఘాట్లను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై పాట్నా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... పడవలో చిన్న టెక్నికల్ సమస్య తలెత్తడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత ముఖ్యమంత్రితో పాటు అందులో ఉన్న ఇతరులను మరొక స్టీమ్ బోట్ లోకి తరలించారని తెలిపారు.