ఐసీసీ సమావేశానికి వచ్చి క్యాబ్లో తిరిగి వెళ్లిన రోహిత్ శర్మ.. వీడియో
- టీ20 ప్రపంచ కప్ కెప్టెన్ల సమావేశంలో పాల్గొన్న రోహిత్
- టీమ్ హోటల్ కు తిరిగి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్న వైనం
- రేపటి నుంచే టీ20 ప్రపంచ కప్
మన దేశంలో క్రికెటర్లకు యమ క్రేజ్ ఉంటుంది. వాళ్లు ఎక్కడికి వెళ్లినా చూసేందుకు అభిమానులు పోటెత్తుతుంటారు. దాంతో, ఇటు పోలీసులు, అటు బీసీసీఐ క్రికెటర్లకు భారీ భద్రత కల్పిస్తుంటుంది. అయితే, విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం ఆటగాళ్లకు ఈ హడావుడి, భద్రతా ప్రోటోకాల్స్ నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఎక్కువ మంది గుర్తు పట్టలేరు కాబట్టి ప్లేయర్లు స్వేచ్ఛగా బయట తిరుగుతుంటారు. ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన భారత జట్టు సభ్యులు కూడా ఓవైపు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తూనే ఖాళీ సమయాల్లో ఆసీస్ అందాలను ఆస్వాదిస్తున్నారు.
ఇక, భారత కెప్టెన్ రోహిత్ శర్మ శనివారం జరిగిన ఐసీసీ సమావేశానికి హాజరయ్యాడు. ప్రపంచ కప్ లో పోటీ పడే 16 మంది కెప్టెన్లతో ఐసీసీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో భారత జెర్సీ ధరించి పాల్గొన్న రోహిత్ సమావేశం తర్వాత టీ షర్ట్, షార్ట్ వేసుకొని బయటికి వచ్చాడు. అంతేకాదు అక్కడి నుంచి టీమ్ హోటల్ చేరుకునేందకు తను క్యాబ్ బుక్ చేసుకున్నాడు. తన కూడా వచ్చిన వ్యక్తి లగేజ్ కారులో సర్దిన తర్వాత రోహిత్ క్యాబ్ ఎక్కిన వీడియోను ఆస్ట్రేలియాకు చెందిన ఓ జర్నలిస్ట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కాగా, ఆదివారం నుంచి టీ20 ప్రపంచకప్ మొదలవనుంది. తొలి వారం క్వాలిఫికేషన్ రౌండ్ మ్యాచ్ లు జరుగుతాయి. 23వ తేదీ నుంచి సూపర్ 12 రౌండ్ జరుగుతుంది. అదే రోజున పాకిస్థాన్ తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడుతుంది.