ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాలలో పాకిస్థాన్ ఒకటి: జో బైడెన్
- అణ్వాయుధాలపై నియంత్రణ లేదన్నఅమెరికా అధ్యక్షుడు
- చైనాతో సంప్రదింపులు ఒబామా వారసత్వమని వ్యాఖ్య
- నాటోను విభజించాలన్నది పుతిన్ ప్రయత్నమన్న బైడెన్
పాకిస్థాన్ విషయంలో అమెరికా తన రెండు నాల్కల ధోరణిని మరోసారి బయటపెట్టుకుంది. పాకిస్థాన్ ను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాలలో ఒకటిగా పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
అమెరికా పాకిస్థాన్ కు దశాబ్దానికి పైగా సైనిక సాయం అందిస్తోంది. అంతేకాదు, అధునాతన యుద్ధ విమానాలు అందించే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది. ఈ తరుణంలో అమెరికాలో శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బైడెన్ పాకిస్థాన్ పై స్పందించారు.
పాకిస్థాన్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటని వ్యాఖ్యానించారు. అణ్వాయుధాలపై ఎటువంటి నియంత్రణ లేదని తప్పుబట్టారు. షీ జిన్ పింగ్ తో సంప్రదింపులు కొనసాగించాలంటూ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తనకు బాధ్యతలు అప్పగించినట్టు బైడెన్ పేర్కొన్నారు. నాటోను విభజించాలన్నది పుతిన్ ప్రయత్నమన్నారు. దీనిపైనా ఆందోళన వ్యక్తం చేశారు.