హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు వెళ్లనున్న చంద్రబాబు
- తెలంగాణలో టీడీపీ బలోపేతంపై చంద్రబాబు దృష్టి
- మధ్నాహ్నం 3 గంటలకు కీలక నేతలతో భేటీకానున్న బాబు
- టీటీడీపీ అధ్యక్షుడిగా కాసానిని నియమించే అవకాశం
తెలంగాణలో పార్టీని మళ్లీ బలోపేతం చేసే పనిలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, నియోజకవర్గాల కమిటీ సభ్యులతో ఆయన భేటీ కానున్నారు.
ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై ఆయన చర్చించనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్షను నిర్వహించనున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ నిన్న మళ్లీ టీడీపీలో చేరారు. ఈ క్రమంలో బక్కని నరసింహులు స్థానంలో కాసానిని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాసాని గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.