ఏపీలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు... ఓటర్ల జాబితాలో చేరేందుకు ఫేక్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్నారన్న సోము వీర్రాజు

  • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ
  • నకిలీ ఓటర్లపై స్పందించిన సోము వీర్రాజు
  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు లేఖ
  • తప్పుడు ఓటర్లను తొలగించాలని డిమాండ్
ఏపీలో త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కొందరు ప్రభుత్వ మద్దతుదారులు గ్రాడ్యుయేట్లుగా ఫేక్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్నారని ఆరోపించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల లిస్టులో చేరేందుకు నకిలీ సర్టిఫికెట్లు సమర్పిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు.  

తప్పుడు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ సమర్పించడమే కాకుండా, వివరాల్లో డమ్మీ విద్యాసంస్థల పేర్లను చూపిస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. తద్వారా ఎన్నికల నియమావళికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ఓటర్ల నమోదు ప్రక్రియ నిబంధనలకు లోబడి జరగాలని, తప్పుడు ఓటర్లను గుర్తించి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.


More Telugu News