'అందాల పోటీల విజేతకు బహుమతిగా ఎన్నారై పెళ్లి కొడుకు' అంటూ ప్రకటన.. షాక్ ఇచ్చిన పోలీసులు!
- పంజాబ్ లోని బతిండాలో వెలిసిన పోస్టర్లు
- ఎన్నారై సంబంధాలు చూస్తున్నవారి నుంచి ఆసక్తి
- నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు
సాధారణంగా అందాల పోటీల్లో విజేతలకు అందాల కిరీటం, బిరుదులు ఇస్తుంటారు. నగదు బహుమతి కూడా ఇస్తారు. కానీ, పంజాబ్ లోని బతిండాలో ఓ అందాల పోటీ ప్రకటన చూసి అందరూ అవాక్కయ్యారు. ఈ పోటీలో విజేతగా నిలిచిన అమ్మాయి బహుమతిగా కెనడాకు చెందిన ఎన్నారైని వరుడిగా గెలుచుకుంటారని బతిండాలో అనేక పోస్టర్లు వెలిశాయి. సోషల్ మీడియాలో సైతం ఈ పోస్టర్లు సర్క్యూలేట్ చేశారు. తమ కుమార్తెలకు ఎన్నారై సంబంధాల కోసం చూస్తున్న తల్లిదండ్రులతో పాటు పలువురు వీటిపై ఆసక్తి వ్యక్తం చేశారు.
కానీ, విషయం తెలిసిన పోలీసులు ఈ నెల 23వ తేదీన అందాల పోటీలను నిర్వహించాలని చూస్తున్న ఆర్గనైజర్స్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. అందాల పోటీ విషయమై రూపొందించిన పోస్టర్లలో మహిళల గురించి అసభ్యకరమైన పదాలు రాసి ఉన్నట్టు గుర్తించామన్నారు. అందుకే కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే, అందాల పోటీ ప్రకటన చూసి నెటిజన్లు షాకయ్యారు. ఇదేం బహుమతి అంటూ నోరెళ్లబెట్టారు. అయితే, ఇందులో తప్పేముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఇతివృత్తంతో రియాలటీ షోలు నడిచాయని, బహుమతి నచ్చని వాళ్లు పోటీలో పాల్గొనకుంటే సరిపోతుంది కదా? అని అభిప్రాయపడుతున్నారు.