ఎన్టీ రామారావుగారిని ఫస్టు టైమ్ ఎక్కడ చూశానంటే: 'అన్ స్టాపబుల్ 2' వేదికపై చంద్రబాబు నాయుడు
- 'అన్ స్టాపబుల్ 1' కి అనూహ్యమైన రెస్పాన్స్
- కొంతసేపటి క్రితమే సీజన్ 2 స్ట్రీమింగ్
- తొలి ఎపిసోడ్ అతిథిగా నారా చంద్రబాబు నాయుడు
- స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు సినిమాలు చూశానంటూ వెల్లడి
'ఆహా'లో 'అన్ స్టాపబుల్' సీజన్ 1కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. మోహన్ బాబుతో మొదలైన ఆ సీజన్, మహేశ్ బాబుతో ముగిసింది. సెలబ్రిటీస్ జీవితాల్లోని కొత్త కోణాలను ఈ టాక్ షో ఆసక్తికరంగా ఆవిష్కరించింది. వ్యాఖ్యాతగా కూడా బాలకృష్ణ తన ప్రత్యేకతను చాటుకున్నారు. కొంత గ్యాప్ తరువాత సెకండ్ సీజన్ ను మొదలుపెట్టారు. నారా చంద్రబాబు నాయుడు - లోకేశ్ పాల్గొన్న ఫస్టు ఎపిసోడ్ ను కొంతసేపటి క్రితం స్ట్రీమింగ్ చేశారు.
గెలుపే ఊపిరిగా .. పట్టుదలే ప్రాణంగా .. ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్ స్టాపబుల్ అంటూ బాలయ్య మాస్ సాంగ్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. నేను మీకు తెలుసు .. నా స్థానం మీ మనసు అంటూ సందడి చేశారు. ప్రజలందరికీ బంధువూ .. మీ అందరికి బాబుగారు .. నాకు బావగారు అంటూ వేదికపైకి చంద్రబాబునాయుడిగారిని ఆహ్వానించారు.
నాన్నగారిని ఫస్టు టైమ్ ఎప్పుడు ఎక్కడ కలిశారు? అనే బాలకృష్ణ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో స్పందించారు. "ఎన్టీఆర్ గారిని నేను అంతకుముందు పేపర్లలో .. సినిమాలలో మాత్రమే చూశాను. అంజయ్యగారి క్యాబినెట్ లో నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు రామకృష్ణ సినీ స్టూడియోలో ఆయనను మొదటిసారిగా కలిశాను. అప్పుడు 'అనురాగదేవత' షూటింగు జరుగుతోంది. షూటింగు బ్రేక్ లో ఆయన నాతో మాట్లాడారు. స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ .. ఏఎన్నార్ సినిమాలను ఎక్కువగానే చూసేవాడిని" అంటూ చెప్పుకొచ్చారు. .
గెలుపే ఊపిరిగా .. పట్టుదలే ప్రాణంగా .. ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్ స్టాపబుల్ అంటూ బాలయ్య మాస్ సాంగ్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. నేను మీకు తెలుసు .. నా స్థానం మీ మనసు అంటూ సందడి చేశారు. ప్రజలందరికీ బంధువూ .. మీ అందరికి బాబుగారు .. నాకు బావగారు అంటూ వేదికపైకి చంద్రబాబునాయుడిగారిని ఆహ్వానించారు.
నాన్నగారిని ఫస్టు టైమ్ ఎప్పుడు ఎక్కడ కలిశారు? అనే బాలకృష్ణ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో స్పందించారు. "ఎన్టీఆర్ గారిని నేను అంతకుముందు పేపర్లలో .. సినిమాలలో మాత్రమే చూశాను. అంజయ్యగారి క్యాబినెట్ లో నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు రామకృష్ణ సినీ స్టూడియోలో ఆయనను మొదటిసారిగా కలిశాను. అప్పుడు 'అనురాగదేవత' షూటింగు జరుగుతోంది. షూటింగు బ్రేక్ లో ఆయన నాతో మాట్లాడారు. స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ .. ఏఎన్నార్ సినిమాలను ఎక్కువగానే చూసేవాడిని" అంటూ చెప్పుకొచ్చారు.