హాట్ కేకుల్లా అమ్ముడుబోయిన దాయాది దేశాల క్రికెట్ మ్యాచ్ టికెట్లు
- ఈ నెల 23న మెల్‌బోర్న్ వేదికగా ఇండియా, పాక్ మ్యాచ్
- ఎంసీబీలో 90 వేల టికెట్లు హాట్ కేకుల్లా సేల్ అయిన వైనం
- 10 నిమిషాల్లోనే అమ్ముడైన అదనపు టికెట్లు
జెంటిల్మన్ గేమ్ క్రికెట్‌కు అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ఇక దాయాది దేశాలుగా ముద్రపడ్డ భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే... ఈ రెండు దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ టీవీలకు అతుక్కుపోతున్న వైనం తెలిసిందే. త్వరలో మొదలు కాబోతున్న టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ ఈ నెల 23న జరగనుంది. ఈ మెగా టోర్నీకే హైలైట్‌గా నిలవనున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఎదురు చూస్తున్నారు.
ఆస్ట్రేలియా, మెల్‌బోర్న్ నగరంలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీబీ) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయట. ఈ మ్యాచ్ టికెట్లు మొత్తం విక్రయమైపోయాయని విక్రయాలను పర్యవేక్షిస్తున్న ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు. స్టేడియంలో సీటింగ్ కెపాసిటీ 90 వేలు కాగా... మొత్తం టికెట్లను విక్రయానికి పెట్టగా... అన్ని టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుబోయానని వారు తెలిపారు. ఇక మరిన్ని టికెట్ల కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న విషయాన్ని పసిగట్టి... స్టేడియంలో నిలుచుని మ్యాచ్‌ని తిలకించే విధంగా కొన్ని అదనపు టికెట్లను విడుదల చేయగా... ఈ టికెట్లు కేవలం 10 నిమిషాల్లోనే అమ్ముడయ్యాయట. దీంతో ఈ మ్యాచ్ టికెట్ల కౌంటర్లలో సోల్డ్ అవుట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.