అమరావతిలో వర్షపు నీటిలోనే విట్, ఎస్ఆర్ఎం వర్సిటీలను సందర్శించిన సోము వీర్రాజు
- వర్షపు నీటితో నిండిపోయిన అమరావతి రోడ్లు
- అమరావతి పరిధిలోని విద్యా సంస్థల పరిశీలనకు వెళ్లిన వీర్రాజు
- వర్షపు నీటిలో పాట్లు పడుతూ ముందుకు సాగిన వైనం
- రాజధానిలో కనీస మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా అమరావతి పరిధిలో ఏర్పాటైన విట్, ఎస్ఆర్ఎం, అమృత విశ్వవిద్యాలయాలను సందర్శించారు. గురువారం కురిసిన వర్షానికి అమరావతి పరిధిలోని రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోగా...ఆ నీటిలోనే ఆయన నానా పాట్లు పడుతూ వర్సిటీలను పరిశీలించారు.
ఈ సందర్భంగా వైసీపీ సర్కారుపై వీర్రాజు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలో వైసీపీ సర్కారు విఫలమైందని ఆయన ఆరోపించారు. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించిన కారణంగానే అమరావతిలో ఈ విద్యా సంస్థలు తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేశాయన్నారు. వైసీపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత దిగ్గజ వర్సిటీలకు వెళ్లేందుకు కూడా వీలు కాని పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ధ్వజమెత్తారు.