'కాంతార' అంటే అర్థం ఇదే: హీరో రిషబ్ శెట్టి

  • ఇటీవలే కన్నడలో విడుదలైన 'కాంతార'
  • తెలుగులో రేపు రిలీజ్ అవుతున్న సినిమా
  • ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న టీమ్ 
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అంటున్న రిషబ్ శెట్టి
కన్నడలో ఇటీవల విడుదలైన 'కాంతార' రికార్డుస్థాయి వసూళ్లను రాబడుతూ వెళుతోంది. రిషబ్ శెట్టి ఈ సినిమాలో హీరో మాత్రమే కాదు, రచయిత - దర్శకుడు కూడా ఆయనే. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో రేపు ఈ సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో రిషబ్ శెట్టితో పాటు హీరోయిన్ సప్తమి గౌడ కూడా పాల్గొంటోంది. 

తాజా ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి మాట్లాడుతూ .. కన్నడలో  'కాంతార' అంటే మిస్టీరియస్ ఫారెస్టు అని అర్థం. ప్రకృతికి .. మానవుడికి మధ్య జరిగే ఘర్షణ ఇది. తమిళనాడులో జల్లికట్టు మాదిరిగానే, కర్ణాటకలో 'కంబళ' అనే క్రీడ ఉంది. కథలో ఆ నేపథ్యం కూడా ప్రధానంగానే కనిపిస్తుంది. ఈ సినిమాకి నేను హీరోను మాత్రమే కాదు, రైటర్ ను .. డైరెక్టర్ ను అయినప్పటికీ ఎక్కువ టెన్షన్ అనిపించలేదు" అన్నారు.  

కథకి ఎక్కడ ఏం కావాలో అది ఇస్తూ వెళ్లాను. అలాగే నా సినిమాల నుంచి ఆడియన్స్ ఏం ఆశిస్తారో ఆ అంశాలు తగ్గకుండా చూసుకుంటూ వెళ్లాను. అందువలన నాకు పెద్దగా కష్టంగా అనిపించలేదు. ఈ సినిమా చివరి అరగంట సేపును ప్రేక్షకులు కుర్చీలో నుంచి కదలకుండా చూస్తారు. అజనీశ్ లోకనాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు. 



More Telugu News