చరణ్ మూవీలో ఆ ఒక్క డాన్స్ అదిరిపోతుందట!

  • షూటింగు దశలో చరణ్ సినిమా 
  • రాజమండ్రిలో జరుగుతున్న షూటింగు
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • డాన్సులు హైలైట్ అంటున్న జానీ మాస్టర్
శంకర్ - చరణ్ కాంబినేషన్ లోని సినిమా షూటింగు దశలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు రాజమండ్రిలో జరుగుతోంది. ప్రధానమైన పాత్రల నేపథ్యంలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రీసెంట్ గా చరణ్ పై ఒక పాటను చిత్రీకరించారు. తమన్ స్వరపరిచిన ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు.

చరణ్ కోసం తాను కంపోజ్ చేసిన పాట ఒక రేంజ్ లో ఉంటుందనీ, సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని జానీ మాస్టర్ అన్నాడు. ఇంతవరకూ చరణ్ చేసిన డాన్సులన్నీ ఒక ఎత్తు, ఈ సినిమాలో తాను కంపోజ్ చేసిన డాన్స్ ఒక ఎత్తు అని చెప్పాడు. ఇక తమన్ కూడా అదే మాట చెబుతుండటం విశేషం. శంకర్ ఆలోచనా విధానాన్ని దృష్టిలో పెట్టుకుని, తాను ఈ సినిమాకి బాణీలను సమకూర్చుతున్నట్టు చెప్పాడు. చరణ్ డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అన్నాడు. 

కియారా అద్వాని కథానాయికగా సందడి చేయనున్న ఈ సినిమాలో, శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో, చరణ్ భార్య పాత్రలో అంజలి కనిపించనుందనే విషయం ఇటీవల జరిగిన లీకుల వలన తెలుస్తోంది.  వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


More Telugu News